హైదరాబాద్ : కర్ణాటకలోని మైసూర్లో దారుణం చోటుచేసుకుంది. సోంత చెల్లెలి పై ఓ అన్న మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. మైసూర్ జిల్లాలోని గిరిదర్శిని నగర్లో నివసించే 16 ఏండ్ల బాలిక తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అనంతరం తన ఇద్దరు అక్కలకు పెండ్లి జరగడంతో ఆమె తన అన్నయ్య వినయ్ కుమార్ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె అన్న మద్యానికి బానిసై మూడు నెలలుగా బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అయితే నవంబర్ 27న( శనివారం) బాలిక గర్భం దాల్చినట్టు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో నిందితుడిపై అలన్ హల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 07:39PM