హైదరాబాద్ : ఓ వ్యక్తి.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం గాటిమాలా నుంచి మియామి బయలుదేరనుండగా విమానం ల్యాండింగ్ గేర్‌లో ఓ వ్యక్తి దాక్కున్నాడు. అనంతరం మూడు గంటల పాటు విమానం ప్రయాణించి ల్యాండయిన తర్వాత అతన్ని అధికారులు గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm