Jan 18,2022 04:17PM
హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు ఇప్పటి వరకూ 158.04 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628 కాగా రికవరీ రేట్ 94.09 శాతంగా పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 1,57,421 రికవరీ కాగా దేశంలో 3,53,94,882 ఇప్పటి వరకూ రికవరీ అయ్యారు.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,891 కేసులు ఒమైక్రాన్ గా అధికారులు తెలిపారు.వీక్లీ పాజిటివిటీ రేట్ 14.92 శాతంగా తెలిపారు. గడిచిన 24గంటల్లో 16,49,143 టెస్ట్ లు నిర్వహించినట్టు తెలిపారు.
Recomended For You