హైదరాబాద్ : ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివార్లలో చోటుచేసుకుంది. అయితే లైంగికదాడి చేసేందుకు మరో బాలిక కోసం నిందుతుడు వెతుకుతుండగా పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాల్లోకెళ్తే.. అలీపుర్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లి బయటకువస్తోంది. అదే సమయంలో బాలిక తండ్రికి పరిచయమున్నసమీర్ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మాయమాటలు చెప్పి బాలికను ఓ అడవి ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.చిన్నారి కనిపించకపోవడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు సమీర్ ను పట్టుకున్నారు. అయితే సమీర్‌ను అరెస్ట్ చేసే సమయంలో అతను అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని, మరో లైంగికదాడికి పాల్పడేందుకు నిందితుడు బాలిక కోసం గాలిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm