Jan 18,2022 06:09PM
హైదరాబాద్ : ఏపీలో కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా బారినపడగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,066 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,514కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,66,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 36,108కి చేరింది.
Recomended For You