హైదరాబాద్ : వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు ఈ సందర్భంగా కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.. అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అయితే విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులన్నీ పిటిషన్లపై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్4కు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:11PM