హైదరాబాద్ : పంజాబ్లో అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసింది. తనిఖీల్లో భాగంగా మొత్తం రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువు అయిన భూపిందర్ సింగ్ నివాసాల్లోనూ ఈడీ దాడులు నిర్వహించగా ఆయన ఇండ్లలో రూ. 8 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే సందీప్ కుమార్ అనే మరో వ్యక్తికి సంబంధించిన నివాసాల్లో రూ. 2 కోట్ల నగదు దొరికింది. త్వరలో ఈడీ వీరికి సమన్లు జారీ చేసి ప్రశ్నించనుంది. పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు ఇంత డబ్బు దొరకడం సంచలనంగా మారింది.
భూపిందర్ సింగ్ హనీ.. పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రాగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్ నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
Recomended For You