Jan 24,2022 12:15PM
కరీంనగర్: జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటాఏస్ వాహనం-కారు ఢీకొని 20 మందికి గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. బాధితులు మహబూబాబాద్, ములుగు జిల్లాల వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్‌లో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Recomended For You