Jan 24,2022 12:21PM
హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారని మంత్రి సబితా రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ. 250 కోట్లు మంజూరు చేశారన్నారు. నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్‌పై వెళ్ళడానికి అవకాశం కల్పించారని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.
Recomended For You