Jan 24,2022 01:04PM
తిరుపతి: రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు అలిపిరి గరుడ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. ముందస్తు నోటీసులు లేకుండా ఎఫ్.ఎన్.ఓ, ఎం.ఎన్.ఓలను తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వంద రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కార్మికులు వేడుకుంటున్నారు.
Recomended For You