Jan 24,2022 01:11PM
హైదరాబాద్ : ప్రాజెక్టులను తమ అధీనంలోకి తీసుకునే విషయంపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం అయ్యింది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా ఇతర అధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ ఆనకట్ట, దేవాదులతో పాటు ఏపీలోని సీలేరు, ఇతర కాంపోనెంట్లు బోర్డు పరిధిలో చేర్చే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
Recomended For You