హైదరాబాద్ : గాయని సునీత రెండో భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యాంగో యూట్యూబ్ ఛానల్ వివాదంలో చిక్కుకుంది. కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించాయి. వెంటనే మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm