May 26,2022 05:14PM
హైదరాబాద్ : రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గురువారం బెంగళూరులో ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తాము జాతీయ, కర్ణాటక రాజకీయాల గురించి చర్చించామన్నారు. జాతీయ స్థాయిలో మార్పు వస్తుందని.. దాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. దేశంలో గిరిజనులు, రైతులు, పేదలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని, జీడీపీ పతనమవుతోందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని, రూపాయి విలువ పడిపోతోందని అన్నారు. కావున దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యం లోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని అన్నారు.
Recomended For You