హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో వాష్ రూంలో కెమెరా పెట్టి మహిళల వీడియోలు తీస్తూ వేధింపులకు గుర్తి చేస్తున్నాడు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లోని ఓ దుకాణంలో బాయ్ గా పని చేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న వాష్‌రూమ్‌లో తన సెల్‌ఫోన్‌ను వీడియో ఆన్ చేసి పెట్టేవాడు. అక్కడ పని చేస్తున్న మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ దృశ్యాలు మొబైల్లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ చాలా మంది మహిళల వీడియోలను చిత్రీకరించినట్టు తెలిసింది. అయితే ఆ దుకాణంలో పని మానేసిన ఓ మహిళ ఫోన్‌కు మూడు రోజుల క్రితం మిథున్ ఫోన్ నుంచి ఓ వీడియో వచ్చింది. దాంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిథున్ దాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతని ఫోన్లో వేరే మహిళలకు సంబంధించిన మరిన్ని వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 06:33PM