May 28,2022 11:46AM
హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కొవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిన్న తిరుమల కొండకు చేరుకున్నారు. 73,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా వీరిలో 41,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Recomended For You