May 28,2022 01:44PM
హైదరాబాద్ : పరిపాలన, మతాలకు సంబంధం ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. పరిపాలన చేతకాక.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అందులో భాగంగానే మసీదుల తవ్వకాల కామెంట్స్ చేస్తున్నారన్నారు. మతాన్ని ఓట్ల కోసమే తెరపైకి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్.. దేశాన్ని ఏకతాటిపైకి తెస్తే.. బీజేపీ దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేస్తోందన్నారు. ఏ మతం కూడా హింసను కోరుకోదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
Recomended For You