May 28,2022 02:10PM
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం వారికి గర్భాలయ ముఖమండపంలో ప్రధాన అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అలాగే స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. వారితోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, నాల్సా మెంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ జైన్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
Recomended For You