May 28,2022 03:00PM
హైదరాబాద్ : పంజాబ్ లో ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ ప్రభుత్వం భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రముఖులు, మత పెద్దల భద్రతనూ రిటైర్డ్ పోలీసు అధికారులు 424 మందికి భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. అందులో డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతా సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో 400 మంది పోలీసులు మళ్లీ స్టేషన్ డ్యూటీలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలిగానీ.. వీఐపీలకు భద్రత పేరుతో జనానికి ఇబ్బందులు కలిగించకూడదని మాన్ అన్నారు.
Recomended For You