హైదరాబాద్ : హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పురాని హవేలీ, సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
కరుడుగట్టిన చైన్ స్నాచర్ ఫైసల్ షా అలీ జబ్రితో పాటు రిసీవర్ ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఫైసల్ షా అలీపై గతంలో శాలిబండ, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. అతనికి 2006 నుంచి నేర చరిత్ర ఉందన్నారు. అతనిపై ఆయా పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో 135 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలోనూ రెండు సార్లు పీడీ యాక్ట్ పై జైల్‌కి వెళ్లాడన్నారు. జైల్ నుంచి ఫైసల్ షా విడుదల కాగానే రిసీవర్ ఖలీల్ ఇద్దరు కలిసి మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని చెప్పారు. అతని అరెస్ట్‌తో మూడు చైన్ స్నాచింగ్ కేసులు చేధించినట్లు చెప్పారు. నిందితుల నుంచి లక్ష 80వేల రూపాయల విలువ చేసే 120 గ్రాముల గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకొని ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 05:01PM