We are delighted to announce the launch of 500 ml & 1 Litre water bottles for passengers. You are welcome to suggest the title & design for the bottles. The best suggestion will get a reward. Send your Suggestion to our @WhatsApp number 9440970000 @TSRTCHQ #TSRTCompetition pic.twitter.com/1BPl6rgp7T
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 28, 2022
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే.. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్, డిజైన్ సూచించాలని కోరారు. ఎవరైతే మంచి పేరు, డిజైన్ సూచిస్తారో వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ చేస్తున్న చారిత్రాత్మక మార్పుకు మీ తోడ్పాటును ఇవ్వాలని, తద్వారా చరిత్రలో నిలిచిపోవాలని చెప్పారు. ప్రయాణికుల కోసం 500 ఎంఎల్, 1 లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. మీ సూచనలను తమ వాట్సాప్ నంబర్ 94409 70000కి పంపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.