అమరావతి : కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ ఆ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల అల్లరు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో శనివారం ఓ కీలక ఆధారం లభించిందని తెలిసింది. అల్లర్లకు పాల్పడ్డారని అరెస్ట్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ సందేశాల్లో '3.10 గంటలకు యుద్ధం ప్రారంభం... పోలీసులు భోజనం చేసే సమయం... ఇదే చక్కటి తరుణం` అంటూ ఉన్నది పోలీసులు గుర్తించారు. ఈ సందేశంతో నిందితులు వ్యూహాత్మకంగానే అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు 44 మందిని అరెస్ట్ చేశారు. పట్టణంలో మరో ఐదు రోజుల పాటు 144 సెక్షన్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. అలాగే ఇంటర్నెట్ సర్వీసులను మరో 24 గంటల దాకా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
Recomended For You