May 28,2022 09:30PM
హైదరాబాద్ : కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్రవాహనాదారుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి అప్పా జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నార్సింగి అప్పా జంక్షన్ వద్ద ఓ కారు ప్రయాణిస్తుండగా అందులో ఉన్న ఎల్లయ్య అనే వ్యక్తి ఉమ్మి వేసేందుకు అకస్మాత్తుగా కారు డోర్ తీశాడు. అయితే ఆ డోరు ఓ ద్విచక్రవాహనదారుడికి తగలడంతో అతను గాల్లోకి ఎగిరి అవతలి వైపు రహదారిపై పడ్డాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ అతనిపై నుంచి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా డోరు తెరిచిన ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recomended For You