అమరావతి : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 10 సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనుంది. దీనిలో భాగంగా ట్రైన్ నెం 07091 కాజిపేట - తిరుపతి రైలు మే 31, జూన్ 7, 14, 21, 28వ తేదీలలో ఉదయం 11 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.20 గంటలకు చేరుకోనుంది. వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
అలాగే 07092 తిరుపతి - కాజిపేట రైలు మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 11.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు చేరుకోనుంది. దారిలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైళ్లల్లో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ రైళ్లకు ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్రారంభమైంది.
Recomended For You