హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పాము కనిపించడంతో వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. శనివార ఉందయం 10 గంటలకు ఉస్మానియా పాత భవనంలోని జనరల్ సర్జరీ విభాగం వద్దకు ఓ పాము రావడంతో వైద్య విద్యార్థులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్నేక్ సొసైటీ ప్రతినిధులను పిలిపించారు. వారు పామును పట్టుకోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా వర్షాకాలం వచ్చిందంటే ఉస్మానియాలో పాముల బెడద తీవ్రంగా ఉంటుందని, ఆస్పత్రికి ఆనుకొని మూసీ ఉండడంతో అందులో నుంచి పాములు వస్తున్నట్టు పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm