హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యింది. హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేసిన కేటీఆర్.... టీహబ్ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కూడా దానికి జోడించారు. టీ హబ్ హైదరాబాద్ ప్రారంభంతో తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు పునరుజ్జీవం రానుందని, ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన ఓ సూక్తిని కేటీఆర్ ప్రస్తావించారు. భవిష్యత్తు ఊహకు దానిని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గమన్న లింకన్ మాటలను ఆయన ప్రస్తావించారు.
Mon Jan 19, 2015 06:51 pm