హైదరాబాద్: భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వానతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతునే ఉంది. శివారు ప్రాంతంలోనూ వర్షం కుమ్మేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులు తలపిస్తుంటే, చెరువులు తెగి ఆ నీరు ఇళ్లల్లోకి వస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలే హైదరాబాద్ రోడ్లు అంతంతమాత్రం, రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ రోడ్డు బాగుందో తెలియక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లేవారు తడిసి ముద్దయిపోయారు. ఆకాశంలో నల్లటి మేఘాలు దప్పటిలా కప్పేశాయి. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm