ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ భామ సాగరిక ఘటే జంట నవంబరులో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీళ్లిద్దరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారట. అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 27న వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే వివాహం జరిగే తేదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. పెళ్లి వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు. వివాహం అనంతరం ముంబయి, పుణెలో జహీర్ జోడీ సన్నిహితులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించనుంది. సాగరికతో నిశ్చితార్థం జరిగినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 25న ట్విటర్ ద్వారా జహీర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm