హైదరాబాద్: దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి, సినిమా ప్రచార కార్యక్రమాల కోసమే ఎక్కువగా సోషల్‌మీడియా వినియోగిస్తుంటారు. అంతకుమించి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించరు. ఒకప్పుడు మొదటిసారి తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన వర్మ తాజాగా చిన్నప్పుడు తన తల్లి సూర్యమ్మతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ అందమైన మహిళ మా అమ్మ. పక్కన జోకర్లా కనిపిస్తున్నది నేనే అని వర్మ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వర్మ 'అరెస్ట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm