తిరుపతి: రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్, కార్యాలయ ఉద్యోగిని మధ్య వివాదం రేగింది. తమను దూషించిన మహిళా ఉద్యోగినిపై చర్యలు తీసుకోవాలని వైద్యుడు వెంకట రమణ ఫిర్యాదు చేశారు. నిరసనగా వైద్యులు ఈ రోజు విధులు బహిష్కరించారు. రేపు కూడా విధులు బహిష్కరిస్తామని వైద్యులు ప్రకటించారు. ఉద్యోగి పై చర్యలు తీసుకోకుంటే ఎల్లుడి అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm