న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ నాలుగు రోజులు పండుగ నేటి అర్థరాత్రి నుంచే ప్రారంభం కాబోతుంది. భారీ డిస్కౌంట్లతో 'బిగ్ బిలియన్ డేస్' సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతుంది. నేటి అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఇది జరుగుతుంది. అన్ని కేటగిరీలపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. భారీ ఎత్తున్న డిస్కౌంట్లతో పాటు, ఫ్యాషన్, దుస్తులు, షూలు, గాడ్జెట్లు, హోమ్ అప్లియెన్స్‌పై ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను అందిస్తోంది. తొలిసారి ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్లను ఎంపికచేసుకునే స్పెషల్ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్ అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ సేవింగ్స్‌ను పొందనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm