హైదరాబాద్ : తెలంగాణ సర్కారు ఆడబిడ్డల కోసమంటూ తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకం తీవ్ర విమర్శలపాలైంది. బతుకమ్మ చీరలు ఒకవైపు మంటలు రేపుతుంటే మరోవైపు బస్తీ మే సవాల్ అని ఫైటింగ్ చేయిస్తున్నాయి. మంచినీళ్ల నల్లా కాడ మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్న రోజులు గతంలో ఎన్నో చూశాం. కానీ ఈ రోజుల్లో ఆ తరహా కొట్లాటలు కనుమరుగయ్యాయి. కానీ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకం నల్లా పంచాయతీలను ముందుకు తెచ్చింది. చీరల కోసం హైదరాబాద్ లోని సరస్వతి శిశు మందిర్ లో కొందరు మహిళలు బస్తీ మే సవాల్ అని సిగలు పట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించారు. ఇంకొందరేమో చీరల కోసం ముష్టిఘాతాలకు దిగారు. దీంతో సరస్వతి శిశుమందిర్ ప్రాంగణం యుద్ధవాతావరణాన్ని తలపించింది. నాసిరకం చీరలిచ్చారని కొందరు కాలబెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm