అసోం: హెచ్ఎన్ఎల్సీ మిలిటెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆర్మీ భద్రతా సిబ్బంది, అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అసోంలోని పశ్చిమ కార్బీ ఆంగ్లాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు దాగిఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, అసోం పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో దాగివున్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm