లిబియా: శరణార్థులతో వస్తున్న ఓడ లిబియా తీర పట్టణం సభ్రతా సమీపంలో మునిగి వందమందికి పైగా జాడ తెలియకుండా పోయారు. ఏడుగురిని మాత్రం కాపాడగలిగామని లిబియా నావికా సిబ్బంది తెలిపారు. అయితే, ఆ ఓడ మునిగి అప్పటికే మూడు రోజులయిందని తాము రక్షించిన వారంతా ఓడకు చెందిన ఒక భాగాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారని లిబియా అధికార ప్రతినిధి అయూబ్ కసీమ్ తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm