యూపీ: ఓ ఆకతాయి వేధింపులు తాళలేక 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని సంబల్లో చోటుచేసుకుంది. ఘటనపై బాలిక తండ్రి స్పందిస్తూ.. అమ్మాయి స్కూల్కు వెళ్తున్నప్పుడు రోజు వెంబడించి వేధింపులకు గురిచేసేవాడు. ఓ రోజు మోబైల్ ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. మొబైల్ తీసుకోవడానికి నిరాకరించగా చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఇక యువకుడి వేధింపులు భరించలేని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm