హైదరాబాద్: ఆహార భద్రత కార్డు కోసం ఆన్లైన్లో వెతకాలన్నా.. ప్రింట్ తీసుకోవాలన్న ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే సరిపోయేది. కుటుంబ సభ్యుల ఆధార్ నెంబరు ఎవ్వరిదైనా కార్డు వివరాలు ప్రత్యక్షమయ్యేవి. ఐతే ఈ సౌకర్యాన్ని పౌరసరఫరాలశాఖ ఇటీవలే తొలగించింది. కేవలం రేషన్ కార్డు నెంబరు ద్వారా మాత్రమే ఆన్లైన్లో చూసే అవకాశా న్ని కల్పించింది. కొత్త రేషన్ కార్డు మరిచిపోయినా ఫర్లేదని, పాత రేషన్‌కార్డు నెంబరు ఉన్నా కార్డును గుర్తించే వీలుండేలా చేసింది. ఆధార్‌కార్డు నెంబరు కాకుండా ఆహార భద్రత కార్డు నెంబరుకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరసరఫరాలశాఖ వెబ్సైట్లోకి వెళ్లి రేషన్‌కార్డు నెంబరు పేర్కొంటో ఆటోమేటిక్‌గా కుటుంబ సభ్యుల వివరాలు ప్రత్యక్షమవుతాయి.
Mon Jan 19, 2015 06:51 pm