హైదరాబాద్: ఇప్పటివరకూ జరిగిన హిందీ బిగ్ బాస్ సీజన్ లలో ఇదే అతి చెత్తది అని వీక్షకులు అంటున్నారు. వివాదాల పరంగా షో వార్తల్లో నిలుస్తూ ఉన్నా.. టీఆర్పీలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా షోలో పాల్గొంటున్న బందగీ కాల్రాకు రెండు బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఒకటి ఇన్ని రోజులూ ఏ అపార్ట్మెంట్ లో అయితే బందగీ ఉంటూ వస్తోందో ఆ అపార్ట్మెంట్ నుండి ఆమెను వెళ్ళిపోమని ఓనర్ తెలిపాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. బందగీ షోలో చేస్తున్న రొమాన్స్ ను చూసి ఆమె తండ్రి ఆరోగ్యం దెబ్బతింది. ఇప్పుడు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నేషనల్ టెలివిజన్ లో ముద్దులు పెట్టుకుంటూ కూతురు కనిపిస్తుంటే తట్టుకోలేని ఆయన ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది.
ఒక ఆంగ్ల వెబ్ సైట్ కథనం ప్రకారం ఈ షోలో పునీష్ శర్మ, బందగీలు చేస్తున్న పనులకు షోలో ఉన్న కంటెస్టెంట్ లే కాకుండా టీవీ చూస్తున్న వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతున్నారు. ఈ చేష్టలను చూసి బందగీ ఉంటున్న ఫ్లాట్ ఓనర్ కు కోపం వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన ఇళ్ళు ఖాళీ చేసేయమని చెప్పారు. అలాగే అపార్ట్మెంట్ సొసైటీ వాసులు కూడా ఆమెను ఇళ్ళు ఖాళీ చేయించాలని చెప్పారట. ఇక బందగీ కుటుంబంలో కూడా పరిస్థితులు సరిగా లేవట.. బ్లడ్ ప్రెషర్ హై అవ్వడంతో ఆమె తండ్రిని ఆసుపత్రిలో చేర్చారు. షోలో ఆమె వల్గర్, డర్టీ పనులు చూసి ఆయన ఇలా తయారయ్యారని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 17,2017 05:22PM