హైదరాబాద్: మంచి కన్నా చెడు పదిరెట్లు వేగంగా ప్రచారాన్ని సంపాదించుకుంటుందని అంటారు. పెద్దనోట్ల రద్దు జరిగిన కొన్ని నెలల తరువాత పది రూపాయల నాణేలు చెల్లవనే ఓ పుకారు షికారు చేసింది. ఇప్పటికి కూడా చాలా మంది పది రూపాయల నాణేలను తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. దీంతో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి పది రూపాయల నాణెంపై ప్రకటన చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న రూ.10 నాణేలను ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ.10 నాణేలు కూడా చట్ట ప్రకారం చెల్లుతాయని స్పష్టం చేసింది. కొత్త, పాత నాణేలు విభిన్నంగా ఉన్నందున పాతవాటిని తీసుకోబోమని ఎవరైనా చెబితే 044ఉ25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm