బీజింగ్: తమ ఫోన్ అలారం ముస్లింలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలను చైనా టెక్ దిగ్గజం హువేయి కొట్టిపడేసింది. ఈ ఫోన్లోని అలారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులను ఉద్దేశించి ప్రత్యేకంగా తయారు చేసినదని, ఇది చైనాలో దొరకదని స్పష్టం చేసింది. హువేయి ఫోన్లోని అలారం ఫంక్షన్ వీడియోలు, స్క్రీన్షాట్లను వినియోగదారులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇందులోని అలారం దగ్గరల్లోని మసీదుల్లో ఉదయపు ప్రార్థలను చేసుకునేందుకు అనుకూలంగా ఉందని విమర్శించారు. హువేయిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన హేవేయి జేడీ డాట్ కామ్, టావోబాబో తదితర ఈ-కమర్షియల్ వెబ్సైట్స్ నుంచి ఆ ప్రొడక్ట్లను తొలగించింది.
Mon Jan 19, 2015 06:51 pm