చైనా : బీజింగ్‌లోని దక్షిణడాక్సింగ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిన్జియాంగ్ గ్రామంలోని ఓ ఇంట్లో నుంచి హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా..మరో 8మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాద ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm