హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అయితే సినిమా ప్రారంభానికి ముందు వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో బల్లపై పోలీస్ టోపీ, చాయ్, తుపాకీ ఉన్నాయి. వాటిపైన రామ్‌గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున, షూటింగ్ మొదలు అని రాసుండడం సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో తన లుక్‌ని నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఈ లుక్‌లో నాగ్ ఎప్పుడూ కనిపించని గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. ఒక చేతిలో గన్ను పట్టుకుని మరో చేతిలో డబ్బు కట్టలతో ఉన్న నాగ్ స్టైల్ హైలైట్‌గా నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm