తనకు మైండ్ దొబ్బిందని, మిగతావి ఈ సినిమా తరువాత తెలుస్తాయని కంపెనీ ముహూర్తపు షాట్ సందర్భంగా రాంగోపాల్ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించాడు. నాకు మైండ్ దొబ్బలేదు... నా మైండ్ బాగానే ఉందిఁ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలకు వేదికపై నుంచే కౌంటరిచ్చాడు నాగ్. ఈ చిత్రం తనకు చాలా ఎక్సయిట్ మెంట్ ను కలిగిస్తోందని, రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉందని చెప్పాడు. ఇవాళ పొద్దున్నే నాలుగింటికే ఆత్రంగా లేచానని, రోజూ ఇలాగే ఉంటే బాగుంటుందని అన్నాడు. సినిమా హిట్ అవుతుందా? హిట్ అవదా? అనేది శివ సమయంలో అనుకోలేదని, ఇప్పుడు కూడా అనుకోవడం లేదని చెప్పాడు
Mon Jan 19, 2015 06:51 pm