హైదరాబాద్: పచ్చని చెట్ల మధ్య, చెరువుగట్టు మీదుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నగరవాసులు సైకిల్ తొక్కేందుకు ఏర్పాటుచేసిన పాలపిట్ట పార్క్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ పార్క్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్క్ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ పార్క్ అభివృద్ధికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm