హైదరాబాద్: ఒక్క చిన్న ఫ్టైట్ రహదారి పక్కనే కుప్పకూలిపోయిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అక్కడి జాతీయ రహదారిపై అతి తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఆ ఫ్లైట్ ప్రయాణించింది. పైలట్ కావాలనే ఇలా తక్కువ ఎత్తులో దాన్ని తీసుకొచ్చాడని అందరూ భావించారు. కానీ, అది కొద్దిసేపటికే రోడ్డుపక్కనే కుప్పకూలింది. రెక్కలు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మలను ఢీకొన్నాయి. రాక్వెల్ అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఒకే ఇంజిన్ కలిగిన ఓ చిన్న విమానం క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్ నుంచి బయలుదేరగా గమ్యస్థానం మరో రెండు కి.మీ దూరం ఉందనగా విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విమానంలో పైలట్‌తో పాటు ప్రయాణికుడు మాత్రమే ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm