టాలీవుడ్ అగ్రనటుడైన నాగార్జునతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున స్పందిస్తూ,28 సంవత్సరాల క్రితం శివ సినిమా నా లైఫ్ ని ఛేంజ్ చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాః అంటూ ట్వీట్ చేశారు. దీనినిని అటాచ్ చేస్తూ వర్మ ప్రియశిష్యుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో సార్.. శివ సినిమా మా జీవితాలను మార్చేసింది. నాగార్జునగారు, వర్మగారు మరోసారి కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్ లో మరో బ్లాక్ బ్లస్టర్ చిత్రం రాబోతుంది. మేమంతా ఇప్పటికీ అన్నపూర్ణా స్టూడియోస్ ను మా ఇంటిలా భావిస్తాం. ఆ గౌరవం, ప్రేమ అలానే ఉన్నాయి. నమస్కారంఁ అంటూ ట్వీట్ చేశారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm