చెన్నై: పెద్దల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సన్నీ లియోని. హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోందీ సెక్సీ బాంబ్. ఆ మధ్య తమిళంలో జై నటించిన వడకరి్ణ చిత్రంలో ఓ పాటలో నటించి తమిళ కుర్ర కారును ఉర్రూతలు వూగించారు. మొత్తానికి దక్షిణాదిలో మాత్రం భారీ క్రేజీని సొంతం చేసుకుంది సన్నీ. ఇటీవల కేరళకు వచ్చిన ఆమెను చూడడానికి భారీ స్థాయిలో జనం గుమిగూడారు. వారిని చూసి ఆశ్చర్యపోవడం ఇతర నాయికల వంతైంది. దీనిపై రాంగోపాల్‌వర్మ కూడా ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా సన్నీ లియోని చెన్నైలో కూడా ప్రేక్షకులను పలకరించనున్నారు. డిసెంబరు మూడో తేదీన ఈవీపీ ఫిలిం సిటీలో జరిగే సంగీత కార్యక్రమంలో ఈమె పాల్గొననుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm