బెంగళూరు : కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ సహనం కోల్పోయారు. మీడియాతో మినిస్టర్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని సదరు మంత్రి కొట్టారు. పిల్లల హక్కులపై బెల్గాంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాతున్న సమయంలో వెనుక నుంచి ఓ యువకుడు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే మంత్రి ఆగ్రహించి.. ఆ అబ్బాయిని కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Mon Jan 19, 2015 06:51 pm