చెన్నై: పద్మావతి చిత్రం లో టైటిల్ పాత్రలో నటించిన దీపిక పదుకొణె తల నరికి తెస్తే రూ.5కోట్లు, రూ.10 కోట్లు రివార్డు ఇస్తామంటూ కొందరు ప్రకటిస్తున్నారు.దీనిపై కమల్ హాసన్ ట్విటర్ ద్వారా స్పందించారు. దీపిక తల నరికి తేవాలంటూ ప్రకటిస్తున్న వారిపై మండిపడ్డారు. దీపిక తల నరికితే దానిని తన వద్దే భద్రంగా దాచుకుంటానని తెలిపారు. నాకు దీపిక తల కావాలి. దానిని భద్రంగా దాచుకుంటా. తన శరీరాకృతి కంటే ఆమె శిరస్సునే ఎక్కువ గౌరవిస్తాను. ఒకప్పుడు చాలా సంఘాలు నా సినిమాలను కూడా వ్యతిరేకించాయి. మాటలు చాలు. ఇది ఆలోచించాల్సిన సమయం. అని ట్వీట్లో పేర్కొన్నారు.
పద్మావతి్ణ చిత్రంపై ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధం విధించారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఈ విషయంలో పద్మావతికి మద్దతుగా నిలిచింది. సినిమా సెన్సార్ బోర్డుకి వెళ్లకముందేవిమర్శించడం సబబు కాదని సోమవారం తీర్పు వెలువరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 10:46AM