* బట్టల షాపుకు బాండ్ అంబాసిడర్గా మరీన పెళ్ళికూతరు మృతదేహం...
* 80 సంవత్సరాలుగా షాపులో బట్టల మధ్య మృతదేహాన్ని వుంచి...
'ఏదైనా మనసుకి దగ్గరైన తరువాత అది మన నుండి దూరమైతే భరించలేని బాధామనసు తట్టుకోలేని వేదన అనుభవిస్తాం'. నిజానికి వారి జ్ఞాపకాలు మరిచిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. కళ్ళెదుట తిరిగే ఆ మనిషి పంచభూతాల్లో కలిసిపోయిన కొంత కాలానికి సదరు వ్యక్తి భౌతిక చిత్ర దృశ్యం ఆనవాళ్ళు మన మనోఫలకం మీంచి చెరిగిపోవచ్చు. కావాలంటే ఇష్టమైనవారు మరణించారన్న వాస్తవాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. సమాధి చేయడానికి వారిని తరలిస్తుంటే వద్దని అడ్డుపడతారు. మనం ప్రేమించే వ్యక్తులకు అంత్యక్రియలు చేయకుండా మన దగ్గరే ఉంచేసుకుంటే? మెడికల్ యూనివర్సిటీ తరహాలో భద్రపరిచి మన కళ్ళెదురుగా పెట్టుకుంటే... సరిగ్గా ఓ కన్నతల్లి అలాగే చేసింది. పేగు బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించింది. మెక్సికోలో ప్రముఖ లా పాపులర్ బట్టల దుకాణం ఉంది. వి వాహా దుస్తుల విక్రయాలకు పేరుంగాని దుకాణం.
కస్టమర్లను ఆకర్షించేలా ఈ షాపు ముందు పెళ్లికూతురు వేషధారణలో ఒక బొమ్మ ఉంటుంది. మార్చి 25,1930లో పెళ్లికూతురు అలంకరణలో చూడచక్కని అందాలబొమ్మను గాజుల అద్దాల మధ్యనిలబెట్టారు. దానిపేరు లా పాస్కౌలిత. చూడ్డానికి బొమ్మే! కానీ బొమ్మ కాదు! నిజంగా బొమ్మ అని ఫిక్సయిపోకండి. గడచిన 80 సంవత్సరాలుగా అద్దాల పెట్టెలో భద్రపరిచిన మృతదేహం! ఏంటి మృతదేహమా! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఒక కన్నతల్లి ప్రియమైన ముద్దుల కూతురు భౌతికదేహమే ఈ అందాల బొమ్మ!. ఓ రకంగా ఈ బొమ్మే కాలక్రమేణా ఆ దుఖాణానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింంది. చూసేవారందరూ బొమ్మని చూసి అది బొమ్మకాదని గట్టినమ్మకంతో వెళుతున్నారట. ఆ షాపుకు వెళ్లేవాళ్ళు ఈ బొమ్మను తదేకంగా చూసి అబ్బురపడిగానీ లోపలకు వెళ్ళలేరు. ఎందుకంటే ఈ బొమ్మ కళ్లు, జుట్టు, అందం ఎవరినైనా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ షాపులోని బొమ్మ (మృతదేహం) ఆ షాపు యజమానురాలు కూతురే. ఇంకా చెప్పాలంటే ఆ బొమ్మ పెళ్ళికూతరు మృతదేహం! పెళ్ళి రోజున తేలుకాటు వల్ల ఆమె కన్ను మూసింది. కూతురు మీద ప్రేమ చంపుకోలేక యజమానురాలు తన కూతురు పాస్కౌలా దేహాన్ని కుళ్ళిపోకుండా భద్రపరిచి తన షాపులోనే బొమ్మగా ఉంచిందని స్థానికులు చెబుతున్నారు. మెక్సికో భాషలో లా పాస్కౌలిత అంటే అర్థం ఃఆమె కూతురుః అని.
అది బొమ్మకాదు శవం అని గుర్తించేసరికి దానికి అతీంద్రియ శక్తులున్నాయన్న ప్రచారం సాగుతోంది. రాత్రిపూట ఆ బొమ్మ షో రూం కిటికీలో తన స్ధానం మార్చు కుంటోందని చెబుతారు. ఈ కథలన్నీ భయపెట్టేవిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ షాపులో పనిచేసేవారికి అందులోనూ అత్యంత ముఖ్యంగా సోనియా బర్షియాగా అనే ఉద్యోగికి ఎక్కువ భయం!! ఎందుకంటారా ఆమె ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ బొమ్మకు ధరింపజేసిన దుస్తుల్ని తెరచాటున మారుస్తుంది. ఆ సమయంలో దుస్తులు మార్చడానికి ఆ బొమ్మ దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడల్లా చేతులు చెమటలతో తడిసిపోతాయట. ఆ బొమ్మ రూపురేఖలు అచ్చం మనిషిలాగే ఉంటాయట. ఇలా చాలామంది ఒకే రకమైన మాట చెప్పేసరికి అది బొమ్మకాదు శవం అనే నిర్ణయానికి వచ్చేశారు. లెక్కప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ బొమ్మకి 75 సంవత్సరాలన్నమాట. ఆ బొమ్మకు ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఆమెను గౌరవించే విధంగా మెక్సికో దేశంలో జరుపుకునే డెడ్ ఫెస్టివల్ నాడు ఆ బొమ్మ దగ్గర పువ్వులు ఉంచుతారు. అక్కడి స్థానిక స్కూల్పిల్లలు ఆ రోజు ఆ బొమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఆత్మ శాంతించాలని కోరుతూ పువ్వులతో ప్రార్థన చేస్తారు. కానీ అక్కడి ప్రజలుగానీ ప్రభుత్వరంగం గానీ ఈ బొమ్మ విషయంలో ఎలాంటి విషయాలను వెల్లడించడంలేదు. దీంతో ఈ బొమ్మ గురించి వాస్తవాలు ఇంకా మర్మంగానే మిగిలిపోయాయి. అదండీ సంగతి మరి ఆ మర్మాన్ని ఎలాచేదిస్తారో వేచి చూడాలి..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 11:02AM