ఇండోనేషియాలో బోగోర్ నుంచి జకార్తా వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఆ రైల్లో ప్రవేశించిన పామును ధైర్యంగా తోకపట్టుకుని కొట్టి చంపిన యువకుడిని ఇప్పుడు ఇంటర్నెట్ లోకం హీరో అంటోంది. అయితే రైల్లోకి ఈ పాము ఎవరో ఒక ప్రయాణికుడి బ్యాగు నుంచే వచ్చి ఉంటుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాగులు పెట్టుకునే చోట నక్కిన పామును, వెనకాల బ్యాగు తగిలించుకున్న యువడొకరు దాని తోకపట్టుకుని లాగి, ఒక్కసారిగా కింద కొట్టి చంపడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఆ పాము విషపూరితమైనదా, కాదా అని తెలుసుకునేలోపే ఆ యువకుడు పామును అలా చంపడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇండోనేషియాలో ప్రజారవాణాలో జంతువులను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 02:15PM