విశాల్ సినిమాకు పందెంకోడి గుర్తుందా? విశాల్ తెలుగులో తనదైన ముద్ర వేసుకుంది ఈ సినిమాతోనే. విశాల్‌కి సంబంధించి ఎన్ని సినిమాలొచ్చినా ఈ సినిమా మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. విశాల్ గురించి ఏదైనా చెప్పాలన్నా పందెంకోడి అని ప్రస్తావిస్తూ చెప్తారు.. ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయాడు. ప్రస్తుతం మరోసారి పందెంకోడిలా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
అదేనండీ.. పందెంకోడి-2 రాబోతోంది. లింగుస్వామి డైరెక్షన్లో ఈ సీక్వెల్ రూపొందబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ నటించనుంది. తమిళనాడులోని టెంకాశిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 03:16PM